About Spiritual


స్వామి సందేశము

 

క్షణక్షణం  మన శ్వాస ఎలా జరుగుతుందో, ప్రతిరోజూసూర్యచంద్రుల గతి తప్పక తిరుగుతుందో, రక్తం నిరంతరం ఎలా ప్రవహిస్తుందోఅలాగే ప్రతిరోజూ స్వామి సందేశవ్యాప్తి జరిగితే శాంతి నెలకొంటుంది.  భాగవద్వాణి నిరంతరమైనది.  స్వామి సందేశాలు ఎక్కడ ప్రకటింపబడుతాయో అక్కడ మానసికచైతన్యం వెల్లివిరుస్తుంది.

 

భజన అనంతరం, నగరసంకీర్తన అనంతరం, నారాయణసేవఅనంతరం,బాలవికాస్ కార్యక్రమాల అనంతరం భాగవద్వాణి వినిపించాలి. మందిరాలలో సేవాకేంద్రాలలో, బాలవికాస్ తరగతులలో, స్వామి సూక్తి,బోధనలను ప్రతిరోజూ ప్రకటిస్తే అనుకోకుండానే మనకు సన్మార్గం ప్రాప్తిస్తుంది.

 

స్వామి సందేశం వివరంగా, ఎక్కువకాలం కాలహరణం చేసేలా, అధ్యయనమండలి చర్చగానో, ఉపన్యాసముగానో  ఉండరాదు. క్లుప్తంగా, భావయుక్తంగా ఆధ్యాత్మిక తత్వాన్ని అందించాలి.  ఉదాహరణకు ప్రతినెలా సనాతన సారధి, వెనుక కవర్ పేజీలో చూపించేలా క్లుప్తత, స్పష్టత, ఆధ్యాత్మికత ప్రతిబింబించాలి.  

 

స్వామి ఎన్నో పద్యసూక్తులు అందించారు.  నాలుగు లైన్లలో ఉంది మంచి భావాన్ని అందిస్తాయి.

కొన్ని పద్యాలు

 

విశ్వమందు విభుడు వెలుగుచుండు.

 

దేవుడనగా వేరు దేశమందున లేడు.

 

సత్య,ధర్మ, శాంతి ప్రేమలు లేకున్న

 

దుష్టసంకల్పములచేత థుఃఖితుడగును

 

సాధనలు చేసి ఫలమేమి ఓర్పులేక 

 

సూటిగా, క్లుప్తంగా అందరి హృదయాలలోనికి మంచి మాటలు చొచ్చుకొనిపోవాలి. మన స్వంత మాటలు అభిప్రాయాలు, పరమతదూషణ, మానవత్వానికి చేటు కలిగించేభావాలు చోటుచేసుకోకూడదు.

 

సందర్భానుసారం, ఆయా పర్వదినాలలో, ప్రత్యేకరోజులలో వాటి ప్రాధాన్యత సంక్షిప్తంగా చెప్పాలి.  స్వామివారు ఆయా సందర్భాన్ని గురించి చేసిన భోధలు వినిపించాలి.  పదేపదే మననం గావించుకునేలా సూక్తులు ఉదహరించాలి