ఓం శ్రీ సాయిరాం, గ్రామ సేవయే రామ సేవ అన్న స్వామి వారి మాట అనుగుణంగా అటవి ప్రాంతంలో గిరిజనులకు సేవ చేస్తున్న క్రమంలో స్వామి వారు కల్పించిన మహత్తర సేవా కార్యం. ఒక గ్రామం మొత్తం స్వామి వారి సేవ వద్దు అనే పరిస్తితి నుండి మా గ్రామం మొత్తం సాయి సేవలో జన్మ ధ్యనం చేసుకొనే భాగ్యం కల్పించండి, పుట్టపర్తి లాంటి పుణ్య స్థలంలో మా అడుగు మోపే ఆదృష్టం కల్పించండి అని మన సాయి కుటుంబ సభ్యులకు తెలుపటం ఆ దేవ దేవుడు మన యందు మనతోనే ఉన్నారు అనుటకు గొప్ప తార్కాణం. నాకోసం ఒక్క అడుగు వేయండి మీకోసం వంద అడుగులు వేస్తూ వస్తాను అని స్వామి మాటకు నిదర్శనంగా ఫిబ్రవరి మాసం లో జరిపిన గిరిజన తాండా సేవలో అగ్ని ప్రమాదంలో గాయాల పాలు అయ్యి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక చిన్న పాపని మన సాయి యువత ఆసుపత్రిలో చేర్పించి 33రోజుల యడబాటు తర్వాత ఆ యేసు సిలువ నుండి విముక్తి చెందిన రోజున ఈ పాప తన ప్రాణాల కోసం చేస్తున్న పోరాటం నుండి విముక్తి చెంది ఇంటికి రావటం సంతోషకరం. స్వామి వారిని నమ్మము అని చెప్పిన గ్రామస్తులు నిన్నటి రోజున చనిపోబోయే పాప బ్రతికి తన చిరు నవ్వులతో గ్రామంలోకి రావటం చూసి సుమారు 5 కి.మి. పాటు స్వామి వారి నామ సంకీర్తన చేస్తూ గ్రామం మొత్తం స్వామి వారి చిత్ర పటంకి ఆరాధించటం బహు ఆనందకరం. ఆ రోజున పాప ఇక బ్రతికే అవకాశం లేదు అని చెప్పిన వైద్యులు ఈ రోజు పాప బ్రతికి తన చిరు నవ్వుల పువ్వులు వెదజల్లుతుంటే నిజంగా ఇది స్వామి వారికి తప్ప ఎవరికీ సాధ్యం కాదు అని చెప్పటం సాయి యువతకి నూతన ఉత్తేజం తీసుకొచ్చింది. ఈ మాత్రం చాలదా స్వామి వారు ఎల్లపుడూ ఎప్పుడు మనతోనే ఉంటారనటానికి తార్కాణంగా చెప్పవచ్చు. సాయి అంటే ఓయీ అంటూ ఎల్లపుడూ మన వెంట జంట కంట ఉంది కాపాడే మన గురువు దైవం తల్లి తండ్రి అయిన స్వామి వారి ఆశీస్సులు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా పైన ఉన్నాయని మరొక్కమారు రుజువు అయినది. గత నెల 27వ తేదీన ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక బాలికను మన యువ విభాగం వారు ఆసుపత్రిలో చేర్పించడం, గ్రామస్తులు అందరూ కూడా ఆ పాప తిరిగి రాదని అన్న మాటలు, పరిస్థితి విషమంగా ఉందని, తిరిగి మామూలు స్థితికి వస్తుందో లేదో అని డాక్టర్ గారు చెప్పిన విషయం అందరికీ విదితమే, కానీ ఒక్క నెల రోజులు కూడా గడవకముందే స్వయంగా తనకు తానుగా లేసి నడవటం పాప ఆరోగ్యం కుదుట పడటం అంతయు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన మన స్వామి వారు కాక ఇంకెవరు చేయగలరు ఇలా. ఆ పాప నవ్వుల పువ్వుల చూస్తుంటే మనకే కాదు ఆ గ్రామ ప్రజలు కూడా స్వామి వారి ఆపార మహిమ అని గ్రహించటం సంతోషకరం. ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొనుటకు సహాయ సహకారాలు అందించిన రాష్ట్ర అధ్యక్షులు గారికి మరియు జిల్లా అధ్యక్షులు గారికి ఆలాగే కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ స్వామి వారు తమ అనుగ్రహ ఆశీస్సులు ప్రసాదించాలని మళ్ళీ ఇలాంటి పరిస్థితులలో ఉన్న పిల్లలు ఎవరు కూడా ఉండకూడదని ఒకవేళ ఉన్నా వారిని బాగు చేసే సేవా భాగ్యం కల్పించాలని స్వామి వారిని ప్రార్థిస్తూ.. జై సాయిరాం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు జయశంకర్ భూపాలపల్లి