*బాలవికాస్ భజన* సాయిరామ్ స్వామివారి దివ్యానుగ్రహ ఆశీస్సులతో నాచారం సమితిలో ప్రతినెలా రెండవ శనివారం జరిగే బాలవికాస్ భజన 09.02.2019 సాయంత్రం 6.30నుండి 7.40 వరకు ఎంతో అద్భుతంగా జరిగింది. సమితి బాలవికాస్ చిన్నారులతో పాటు విద్యాజ్యోతి పాఠశాల విద్యార్థులు కూడా పాల్గొన్నారు. 43 మంది చిన్నారులు,20 మంది పెద్దలు పాల్గొన్నారు. పిల్లలు 17 భజనలు స్వామివారికి సమర్పించారు. మంగళహారతి తో కార్యక్రమం సంపన్నమైంది. జై సాయిరామ్ కన్వీనర్ నాచారం సమితి మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా.