Service
ఓం శ్రీ సాయిరాం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా అధ్యక్షులు మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు సూచనలు మేరకు స్వామి వారి శతజయంతి వేడుకలు సందర్భంగా 100 గ్రామాలలో మండుటెండలలో పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీల దాహార్తి తీర్చేందుకు లక్ష్యంగా జరుగుతున్న సేవలో భాగంగా సోమవారం నాడు రఘునాథపాలెం మండలం పంగిడి గ్రామంలో సుమారు 200 మంది ఉపాధి హామీ కూలీలకు ఉచితంగా మజ్జిగ పంచడం జరిగినది . ఈ సేవా కార్యక్రమాన్ని గ్రామస్తులు పెద్ద ఎత్తున హర్షించారు ఈ కార్యక్రమంలో సత్య సేవాదళ్ సభ్యులు శ్రీ భూక్య వెంకన్న గారు గ్రామ సర్పంచ్ హరి సింగ్ నాయక్ గారు ఉపసర్పంచ్ బూడ రాజా గారు గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ మరియు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు గ్రామ పెద్దలు గ్రామ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు