🙏ఓం శ్రీ సాయిరాం 🙏 శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా, తెలంగాణ 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో 9/5/2026 శనివారము రోజు ఖమ్మం జిల్లా,ఖమ్మం సమితి పరిధి లోని నాగులవంచ గ్రామములో ఖమ్మం జిల్లా శ్రీ సత్యసాయి సేవాసంస్థల వారి ఆధ్వర్యములో "శ్రీ సత్యసాయి ప్రేమామృత విద్యానికేతన్" విలువలతో కూడిన ఉచిత విద్యాలయం ( మానవతా విలువలు నైతిక విలువలు ప్రాధాన్యతగా) నిర్మాణము కొరకు మరియు నేచర్ క్యూర్ హాస్పిటల్ నిర్మాణము కొరకు భూమి పూజ కార్యక్రమము ఘనంగా అత్యంత వైభవంగా జరిగింది. తొలుత నాగులవంచ గ్రామంలో రామాలయం నుండి ఉదయం 7 గంటలకు భూమిపూజ జరిగే ప్రాంగణం వరకు మహిళలతో కలసి మహా నగర సంకీర్తన పూర్తిచేసుకుని తదుపరి 8-00 గంటలకు విఘ్నేశ్వర పూజ ప్రారంభించి వాస్తు పూజ,రుద్రాభిషేకం తదుపరి 10.37 నిమిషములకు శంకుస్థాపన బ్రాహ్మణోత్తములచే , శ్రీ సత్యసాయి వేద పాఠశాల వైరా వేద పండితులచే పెద్దల సమక్షంలో ,స్వామి వారి ఆశీస్సులతో ఘనముగా పూర్తి చేయుట జరిగినది. ఈ మహత్తర లోక కళ్యాణ కార్యక్రమంలో స్థల దాత శ్రీ చల్ల కోటయ్య గారు, డైరెక్టర్ మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ దమ్మాలపాటి .సుధాకర రావు గారు, శ్రీ నాగేంద్ర గారు, శ్రీ వంగవీటి.భాస్కర రావు గారు, NRI foundation శ్రీ బయ్యన బాబూరావు గారు పాలొన్నారు. విశిష్ఠ అతిథులు శ్రీ సత్యసాయి ధ్యానమండలి వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ భిక్షమయ్య గురూజీ గారు , నాగులవంచ ,సీతంపేట సర్పంచులు శ్రీమతి నారగని.రాంబాయి గారు ,శ్రీమతి ఆళ్ల .మణి గారు, మత్కెపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ శ్రీ అంబటి వేంకటేశ్వర రావు గారు, వి.వి.సి.చైర్మన్ శ్రీ వి.వి.రాజేంద్రప్రసాద్ గారు తదితర పలువురు ప్రముఖులు పాల్గొని తమ అమూల్య సందేశములను అందించారు. ఈకార్యక్రమములో చింతకాని మండలము లోని పలు భజనమండలుల నుండి గ్రామ ప్రజలు ,మరియు జిల్లా కార్యవర్గసభ్యులు,జిల్లాలోని వివిధ సమితుల బాధ్యులు, కార్యకర్తలు ,వివిధ భజన మండలిల సభ్యులు,ఖమ్మం సమితి బాధ్యులు ,సాయి కుటుంబ సభ్యులు, మహిళా సభ్యులు, యూత్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొంది తరించారు. పెద్దలు శ్రీ మాదిరాజు రామచంద్ర రావు గారు, ప్రముఖ న్యాయవాది కందిబండ రాంప్రసాద రావు గారు పాల్గొన్నారు.. జిల్లా అద్యక్షులు మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ దమ్మాలపాటీ సుధాకర రావు గారు తమ ప్రసంగంలో స్వామి వారి అనుగ్రహము కృపా కటాక్షాలతో మాత్రమే ఇట్టి విద్యాలయ స్థాపనకు గత సంవత్సరం 2025 మే నెలలో సంకల్పించుకొని, తదనుగుణంగా 5-00 ఎకరాలు స్థల సేకరణ చేసి ఈ సంవత్సరం 2026 మే నెలలో భూమిపూజ జరుపుకోవడం స్వామి వారి ప్రేమకు ప్రత్యక్ష నిదర్శనమని, స్వామి దీవెనలతో మాత్రమే సాధ్యపడింది అని , రాబోయే 2027 మే నెలకల్లా నిర్మాణాలు పూర్తి కావాలని, పాఠశాల ప్రారంభం కావాలని స్వామి వారిని ప్రార్థిస్తూ కోరుకుంటున్నామని అన్నారు. ఖమ్మం జిల్లాలో వేదపాఠశాల నిర్వహణ, విద్యాలయం మరియు ప్రకృతి వైద్యాలయం స్థాపనకు భూదాతలు ప్రేమతో, సేవాభావంతో ముందుకు రావడం కేవలం స్వామి వారి సంకల్పం మరియు స్వామి వారి నిర్ణయమే అన్నారు.. ఇంతమంది మహానుభావులు ఇట్టి మహత్తర కార్యక్రమానికి హాజరుకావడం స్వామి వారి ప్రేమకు నిదర్శన మన్నారు.. కార్యక్రమానంతరం 900 మందికి నారాయణ సేవ (భోజన సౌకర్యం)జరిగింది... స్వామి వారికి కృతజ్ఞతలతో సాయిరాం 🙏 జిల్లా అద్యక్షులు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా తెలంగాణ