Service
ఓం శ్రీ సాయిరాం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా, తెలంగాణ 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో.... ఈ రోజు 21/3/2026 తేదీన రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఖమ్మం సమితి, ఖమ్మం పట్టణం గాంధీచౌక్ లోని పాత టెలిఫోన్ ఎక్చేంజ్ పక్కనే వున్న ఈద్గా వద్ద ప్రతి సంవత్సరం ప్రార్థనలు చేసుకునే ముస్లిం సోదరుల సౌకర్యార్థం ఖమ్మం సమితి నిర్వహించే పాద రక్షలు భద్ర పరచే సేవా కార్యక్రమం ఈరోజు ఉదయం 8.30 గంటలకు ప్రారంభమయింది.. ఈ కార్యక్రమంలో శ్రీ దమ్మాలపాటి సుధాకరరావు గారు జిల్లా అద్యక్షులు మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు, శ్రీ A నరసింహా రావు గారు ఖమ్మం సమితి కన్వీనర్ గారు, జిల్లా కార్యవర్గ సభ్యులు, ఖమ్మం సమితి కార్యవర్గ సభ్యులు యూత్ సభ్యులు, యాక్టీవ్ సభ్యులు పాల్గొని ముస్లిం సోదరులకు ప్రేమతో సేవలు అందించారు.. ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు మాట్లాడుతూ సోదర భావంతో ప్రేమతో కొనసాగిస్తున్న ఇట్టి సేవలను కొనియాడారు.. జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా, తెలంగాణ