Special Programs
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర శ్రీ సత్యసాయిసేవాసంస్థ ల అధ్యక్షులవారి ఆదేశానుసారం శ్రీరామనవమి పర్వదినమును పురస్కరించుకుని పుట్టపర్తిలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి మూర్తుల కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి అంకురార్పణగా 4/3/2026 తేదీన ఉదయము ఖమ్మం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి మందిరములో మహిళా విభాగము వారి ఆధ్వర్యములో పసుపు దంచె కార్యక్రమము మరియు గోటి తలంబ్రాల కార్యక్రమము అంగరంగ వైభవంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమములో మహిళలు సకాలములో , అత్యంత భక్తి శ్రద్ధలతో,వేదమంత్రములతో,నామ సంకీర్తనలు చేస్తూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొంది తరించారు. జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా