Special Programs
ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో లోక కళ్యాణం కోసం శ్రీరామనవమి రోజు జరిగే శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవ వేడుకలకు అంకురార్పణగా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లాలో శ్రీ సత్యసాయి వేద పాఠశాల వైరా లోతేదీ 4.3.2026 బుధవారం రోజున పసుపు కొమ్ములు దంచుట గోటితో తలంబ్రాలు తీయుట తలంబ్రాలు కలుపుట మొదలగు కార్యక్రమాలు అత్యంత భక్తి శ్రద్ధలతో భగవాన్ నామ స్మరణతో భజనలతో జరుపనైనది. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.. జిల్లా అద్యక్షులు మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు పాల్గొన్నారు.. వైరా మున్సిపల్ వైస్ చైర్మన్, వార్డు మెంబెర్స్ కూడా పాల్గొన్నారు జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా