Special Programs
శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా **** భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శతజయంతి ఉత్సవాలు పురస్కరించుకుని అఖిల భారత దేశ కార్యక్రమంలో భాగంగా మన ఖమ్మం జిల్లాలో శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య బోధనలను మానవీయ విలువలను చాటి చెప్పే ఉద్దేశంతో తలపెట్టిన " విలువలతో కూడిన రన్ & రైడ్ కార్యక్రమం" (Run & Ride with values) ఖమ్మం పట్టణం లకారం ట్యాంక్ బండ్ వద్ద 1/2/2026 ఆదివారం ఉదయం 6-00 గంటలకు 3K/5K రన్ అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని విశిష్ఠ అతిథులు జిల్లా జడ్జి శ్రీ రాజగోపాల్ గారు, మరియు శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి.వెంకటరావు గారు ఫ్లాగ్ ఆఫ్ చేసి 3K/5K రన్ ప్రారంభించారు.. అంతకు ముందు రాష్ట్ర అద్యక్షులు, రాష్ట్ర సమన్వయ కర్తలు తమ సందేశాలలో కార్యక్రమం ముఖ్య ఉద్దేశం 🔹మానవతా విలువలు ప్రచారం..(Promotion of Human values)సత్యం ధర్మం శాంతి ప్రేమ అహింస అనే ఐదు మానవ విలువలను సమాజం లో ముఖ్యంగా యువతలో పెంపొందించడం "అందరిని ప్రేమించు - అందరికీ సేవ చేయి" Love All - Serve All " సందేశం 🔹 ఏకత్వ భావం(Spirit of Unity" కుల మత వర్గ మరియు ప్రాంతీయ విభేదాలకు అతీతంగా మనమంతా ఒకటే అనే భావనను చాటి చెప్పడం.. 🔹 యువతలో పరివర్తన 🔹 నిస్వార్థ సేవ మరియు నిరాడంబరత.. గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ తుమ్మల యుగంధర్ గారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రేమతో పాల్గొన్నారు. యువతను ప్రోత్సహించారు.శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షులతో పాటు రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ సోమ సుందరం గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఖమ్మం జిల్లా అద్యక్షులు శ్రీ దమ్మాలపాటి సుధాకర రావు గారు, రాష్ట్ర కోఆర్డినేటర్లు శ్రీ R అనిల్ కుమార్ గారు, లక్ష్మీనారాయణ గారు, రాష్ట్ర యూత్ కోఆర్డినేటర్ శ్రీ నాగరాజు గారు,రాష్ట్ర మహిళా కోఆర్డినేటర్ నాగజ్యోతి గారు, రాష్ట్ర ఇతర యాక్టివిటీ ఇన్చార్జెస్ పాల్గొన్నారు..ఖమ్మం జిల్లా కార్యవర్గ సభ్యులు, ఖమ్మం సమితి కన్వీనర్ శ్రీ A నరసింహా రావు గారు, సమితి కార్యవర్గ సభ్యులు, వైరా సమితి కన్వీనర్ గారు, భక్తులు, మహిళా సభ్యులు యూత్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పలువురు ఖమ్మం కార్పొరేటర్స్ , వాకర్స్ అసోసియేషన్ సభ్యులు , శ్రీ సత్యసాయి ధ్యాన మండలి సభ్యులు, NRI foundation సభ్యులు, వివిధ విద్యా సంస్థల విద్యార్థులు మొత్తం 2000 మంది రన్&రైడ్ ఫర్ వాల్యూస్ కార్యక్రమంలో ప్రేమతో పాల్గొన్నారు.. అందరికి మంచి నీరు, అల్పాహారం ఏర్పాటు చేయడమైనది. ఖమ్మం, తెలంగాణలో నిర్వహించిన శ్రీ సత్యసాయి రన్ & రైడ్ ఫర్ వాల్యూస్ ప్రేరణాత్మక కార్యక్రమం సమాజంలో ఆరోగ్యం, ఐక్యత, స్వార్థరహిత సేవ మరియు మానవ విలువల సందేశాన్ని విస్తృతంగా ప్రసారం చేసింది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో యువత తమ అంకితభావం, సంఘటిత శక్తి మరియు సేవాసంకల్పాన్ని అద్భుతంగా ఆవిష్కరించింది. జిల్లాకు చేరిన స్వామి వారి అఖండ ప్రేమ జ్యోతిని అందరూ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆశీర్వదించిన స్వామి వారికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుతూ, కార్యక్రమంలో పాల్గొన్న అందరికి ధన్యవాదములు తెలుపుతున్నాను . నేషనల్ టీం మరియు స్టేట్ టీం రన్ & రైడ్ ఇంచార్జెస్ శ్రీ సాయి క్రిష్ణా రెడ్డి గారికి ,ఆనంద్ గారికి మరియు రామకృష్ణ గారికి ప్రత్యేక ప్రేమ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.. సాయిరాం🙏 దమ్మాలపాటి సుధాకర రావు జిల్లా అద్యక్షులు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా. మరియు ఉపాధ్యక్షులు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు తెలంగాణ రాష్ట్రం