Special Programs
శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా **** భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శతజయంతి ఉత్సవాలు పురస్కరించుకుని అఖిల భారత దేశ కార్యక్రమంలో భాగంగా మన ఖమ్మం జిల్లాలో శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య బోధనలను మానవీయ విలువలను చాటి చెప్పే ఉద్దేశంతో తలపెట్టిన " విలువలతో కూడిన రన్ & రైడ్ కార్యక్రమం" (Run & Ride with values) ఖమ్మం పట్టణం ట్యాంక్ బండ్ వద్ద 1/2/2026 ఆదివారం ఉదయం 6-00 గంటలకు 3k రన్ నిర్వహించనున్న విషయం తెలిసిందే.. కార్యక్రమం ముఖ్య ఉద్దేశం: 🔹మానవతా విలువలు ప్రచారం..(Promotion of Human values)సత్యం ధర్మం శాంతి ప్రేమ అహింస అనే ఐదు మానవ విలువలను సమాజం లో ముఖ్యంగా యువతలో పెంపొందించడం "అందరిని ప్రేమించు - అందరికీ సేవ చేయి" Love All - Serve All " సందేశం 🔹 ఏకత్వ భావం(Spirit of Unity" కుల మత వర్గ మరియు ప్రాంతీయ విభేదాలకు అతీతంగా మనమంతా ఒకటే అనే భావనను చాటి చెప్పడం.. 🔹 యువతలో పరివర్తన 🔹 నిస్వార్థ సేవ మరియు నిరాడంబరత.. ఇట్టి శ్రీ సత్యసాయి విలువలతో కూడిన రన్ & రైడ్ కార్యక్రమం లో పాల్గొని ప్రోత్సహించవలసిందిగా కోరుతూ ఈరోజు లకారం ట్యాంక్ బండ్ వద్ద ఖమ్మం పట్టణ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులను, ఇంటర్నేషనల్ అధ్యక్షులను, సభ్యులను కలిసి ప్రేమపూర్వకంగా జిల్లా అద్యక్షులు మరియు ఖమ్మం సమితి కన్వీనర్ గారు ఆహ్వానించుట జరిగింది. జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా.