Special Programs
శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా **** Sri Sathya Sai Run&Ride 1/2/2026 6-00AM at Lakaram Tank bund Khammam 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శతజయంతి ఉత్సవాలు పురస్కరించుకుని అఖిల భారత దేశ కార్యక్రమంలో భాగంగా మన ఖమ్మం జిల్లాలో శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య బోధనలను మానవీయ విలువలను చాటి చెప్పే ఉద్దేశంతో తలపెట్టిన " విలువలతో కూడిన రన్ & రైడ్ కార్యక్రమం" (Run & Ride with values) ఖమ్మం పట్టణం లకారం ట్యాంక్ బండ్ వద్ద 1/2/2026 ఆదివారం ఉదయం 6-00 గంటలకు 3k రన్ నిర్వహించనున్న విషయం తెలిసిందే.. కార్యక్రమం ముఖ్య ఉద్దేశం: 🔹మానవతా విలువలు ప్రచారం..(Promotion of Human values)సత్యం ధర్మం శాంతి ప్రేమ అహింస అనే ఐదు మానవ విలువలను సమాజం లో ముఖ్యంగా యువతలో పెంపొందించడం "అందరిని ప్రేమించు - అందరికీ సేవ చేయి" Love All - Serve All " సందేశం 🔹 ఏకత్వ భావం(Spirit of Unity" కుల మత వర్గ మరియు ప్రాంతీయ విభేదాలకు అతీతంగా మనమంతా ఒకటే అనే భావనను చాటి చెప్పడం.. 🔹 యువతలో పరివర్తన 🔹 నిస్వార్థ సేవ మరియు నిరాడంబరత.. ఇట్టి శ్రీ సత్యసాయి విలువలతో కూడిన రన్ & రైడ్ కార్యక్రమం పురస్కరించుకొని ఈరోజు ఉదయం చెరువు బజారు సత్యనారాయణపురం కాలనిలో శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు, వ్యవసాయ, మార్కెటింగ్, కోఆపరేషన్, చేనేత మరియు జౌళి శాఖ వారు శ్రీ సత్యసాయి రన్ & రైడ్ ప్లెక్స్ బ్యానర్ ను ఆవిష్కరించుట జరిగినది . ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొనుట జరిగింది.. శ్రీ సత్య సాయి సేవా సంస్థల జిల్లా అద్యక్షులు శ్రీ దమ్మాలపాటి సుధాకర రావు గారు కార్యక్రమ ప్రాధాన్యత, వివరాలు తెలియజేశారు.. ప్రతి ఒక్కరూ ఈ విశిష్ఠ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతూ విజ్ఞప్తి చేశారు. ఖమ్మం సమితి కన్వీనర్ గారు జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.. సాయిరాం జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా.