Service
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామి వారి శత వర్ష జయంతి మహోత్సవ కార్యక్రమాలలో భాగముగా శీతాకాలం దృష్ట్యా ఇండ్లు లేక వీధులవెంట పడుకునే నిరాశ్రయులకు చలి నుండి రక్షణ నిచ్చు నిమిత్తమై ఖమ్మం పట్టణములో వివిధ ప్రాంతములలో నిద్రిస్తున్న వారికి రాత్రి ఖమ్మం సమితిలోని యువజన విభాగము వారి ఆధ్వర్యములో, 87 బ్లాంకెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయుట జరిగినది. యూత్ సభ్యులు అందరూ వీధుల వెంట తిరుగుతూ వీధుల వెంట నిద్రిస్తున్న వారికి బ్లాంకెట్స్ కప్పి చలి నుండి రక్షణ కల్పించే సేవలో పాల్గొన్నారు.ఇలాంటి మహత్తరమైన సేవ చేసుకునే అవకాశము కల్పించిన స్వామి వారికి కృతజ్ఞతలు.. సాయిరాం