Bhajans
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామి వారి శత వర్ష జన్మ దిన వేడుకలు ఖమ్మం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి మందిరములో ఘనముగా నిర్వహించబడినవి.. సాయంత్రం భజన తో ప్రారంభమై స్వామి వారి జన్మ దినోత్సవ వేడుకలలో భాగముగా. శ్రీ మాదిరాజు రామచంద్రరావు గారి సత్సంగం, బాల వికాస్ విద్యార్థులచే కేక్ కట్ చేసి స్వామి వారికి జన్మ దిన శుభాకాంక్షలు తెలియచేసి స్వామి వారి ఆశీస్సులు అందుకొనుట జరిగినది. తదుపరి స్వామి వారికి వూంజల్ సేవ నిర్వహించుకుని, పండిత సత్కారము చేసుకుని ,స్వామి వారికి మహా మంగళహారతి సమర్పించుటతో స్వామి వారి శత వర్ష పుట్టిన రోజు వేడుకలు ముగిసినవి.ఈ రోజు ఉదయము నుండి సాయంత్రం వరకు జరిగిన అన్ని కార్యక్రమాలను దగ్గర ఉండి ఘనముగా పూర్తిచేయించిన స్వామి వారికి ముందుగా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ సాయిరాం