Special Programs
ఓం శ్రీ సాయిరాం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, స్వామి వారి శత జయంతి ఉత్సవాలు పురస్కరించుకుని మధిర సమితి, దెందుకూరు గ్రామంలో 11/11/2025 మంగళవారం ఉదయం 10- 00 గంటలనుండి పాడి పరిశ్రమ పై అవగాహన కార్యక్రమం (Awareness programme on Dairy Farming) నిర్వహించబడింది పాడి రైతుల సంక్షేమం అభిలషిస్తూ మహిళా పాడి రైతులు 35 మందికి పాల క్యానులు అందించబడినవి. ఆతరువాత విద్యార్థులకు డిక్షనరీలు బహుకరించబడినవి మధిర సమితిలో సెప్టెంబర్ నెలలో నిర్వహించిన వ్యాస రచన పోటీలలో విజేతలకు, ప్రశంసా పత్రాలు,బహుమతి ప్రధానం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ దొండపాటి వెంకటేశ్వర రావు గారు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్, Dr బి శ్రీనివాస రావు గారు, జిల్లా జాయింట్ డైరెక్టర్ పశు సంవర్ధక శాఖ, Dr N ఉమా కుమారి గారు ,పశు వైద్య అధికారిణి, శ్రీ కళ్యాణం పుల్లారావు గారు, మరియు శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా అద్యక్షులు శ్రీ డి సుధాకర రావు గారు పాల్గొని ప్రసంగించారు..ఇంకను మధిర తహసీల్దార్ గారు, MPDO గారు, MEO గారు ఉపాధ్యాయులు తదితర అధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు.. జిల్లా కార్యవర్గ సభ్యులు, సమితి కన్వీనర్ ,సభ్యులు, భజన మండలి సభ్యులు యాక్టివ్ సభ్యులు గ్రామస్థులు, విద్యార్థులు పాల్గొన్నారు. సాయిరాం జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా