Balvikas
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శతజయంతి ఉత్సవాలు పురస్కరించుకుని స్వామి వారి ఆశీస్సులతో ఖమ్మం సమితిలో 12/10/2025 8-30 AM మాతృశ్రీ ఈశ్వరాంబా మహిళా వృద్ధాశ్రమం,VDO's కాలనీ నుండి బాలవికాస్ గురువుల ఆధ్వర్యంలో బాలవికాస్ విద్యార్థులచే ర్యాలీ ప్రారంబించబడి ద్వారకా నగర్ సెంటర్ లో స్వామి వారి చిత్రపట ఆవిష్కరణ వద్దకు చేరుకుంది..స్వామి వారి చిత్రపట ఆవిష్కరణ అనంతరం 56 వ డివిజన్ పారిశుధ్య కార్మికులకు సత్కారాలు జరిగాయి.. ఈ కార్యక్రమంలో శ్రీమతి పైడిపల్లి రోహిణిసత్యనరాయణ గారు 56 వ డివిజన్ కార్పొరేటర్, శ్రీ దమ్మాలపాటి సుధాకర రావు గారు, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా అద్యక్షులు, శ్రీ A నరసింహారావు గారు , ఖమ్మం సమితి కన్వీనర్, శ్రీ మాదిరాజు రామచంద్రరావు గారు తదితర ప్రముఖులు పాల్గొన్నారు.. బాలవికాస్ గురువులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సాయిరాం🙏