Special Programs
ఓం శ్రీ సాయిరాం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా 🌺🌺 శ్రీ సత్యసాయిశ్వరుని శత జయంతి వేడుకలను విశ్వ వ్యాప్తంగా సాయి భక్తులు ఆనందోత్సాహాలతో జరుపు కుంటున్న ఈ శుభవేళ ... గత 20 సంవత్సరాలుగా అనేక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేస్తున్న గరికపాడు భజన మండలి, యూత్ సర్వీసెస్ కు గుర్తింపు పొందిన గరికపాడు గ్రామంలో స్వామి వారి కృపతో.. ఈరోజు తేదీ 23/10/2025 ఉదయం గం: 9- 45 నిమిషాలకు సుముహూర్తాన శ్రీ సత్య సాయి సేవాకేంద్రం నిర్మాణం కొరకు శంకుస్థాపన ఆతదుపరి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు శ్రీ సత్యసాయి వేద పాఠశాల వైరా వేద పండితుల చే అత్యంత వైభవంగా జరిగాయి..ఈ సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీ D సుధాకర రావు గారు శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షులు స్వామి వారి శత జయంతి ఉత్సవాలు పురస్కరించుకుని సంకల్పించుకున్న, జరుగుతున్న అనేక ఆధ్యాత్మిక మరియు సేవా కార్యక్రమాలు వివరిస్తూ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు, సమితి సభ్యులు, భజన మండలి సభ్యులు, గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సాయిరాం జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్య సాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా..