Pujas & Vrathams
🌻ఓం శ్రీ సాయిరాం🌻 శ్రీ సత్య సాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో.... స్వామి వారి శత జయంతి ఉత్సవాలు పురస్కరించుకుని వైరా సమితి వైరా శ్రీ సత్యసాయి వేదపాఠశాల ప్రాంగణం లో 27/10/2025 కార్తీక సోమవారం ఉదయం 9- 00 గంటలకు గోపూజ మరియు 9- 30 గంటల నుండి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు శ్రీ సత్యసాయి వేదపాఠశాల వైరా వేద పండితుల చే, వేద విద్యార్థులచే వైభవంగా నిర్వహించబడినవి. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు తదితర పలువురు ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు.. సాయిరాం🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సమితి వైరా, ఖమ్మం జిల్లా