🙏ఓం శ్రీ సాయిరాం 🙏 🔸భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామి వారి శత వర్ష జయంతి మహోత్సవ కార్యక్రమములలో భాగముగా ఖమ్మం సమితి వారి ఆధ్వర్యములో ప్రతి నెల వి.డి.ఓస్ కాలనీ లో శ్రీమతి ఈశ్వరాంబ వృద్ధ మహిళా ఆశ్రమం వేదికగా నిర్వహించుకునే జాతీయ నిత్య నారాయణ సేవా కార్యక్రమంలో భాగముగా ఈనెల అనగా 12-10-25 వ తేదీ ఆదివారం ఉదయం 10.30 గంటలకు ఎయిడ్స్ బాధితులకు అమృత కలశములు పంపిణీ చేసే కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమమునకు మనం ప్రత్యేక విశిష్ఠ అతిధిగా తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యకులు శ్రీ ఏలూరి.శ్రీనివాస రావు గారిని,ఆత్మీయ అతిధులుగా తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ అధ్యక్షులు శ్రీ గుంటుపల్లి.శ్రీనివాస రావు గారిని, సెక్రటరీ గారు శ్రీ కొణిదెన.శ్రీనివాస్ గారిని,మరికొంత మంది యూనియన్ పెద్దలను,వెటర్నరీ డాక్టర్ల అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ రమేష్ గారిని మరియు శ్రీ సత్యసాయి సమాజ సేవా ట్రస్టు చైర్మన్ శ్రీ రామచంద్ర రావు గారిని ఆహ్వానించుకోవటం జరిగినది.ఈ కార్యక్రమమునకు ఖమ్మం జిల్లా సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులు శ్రీ దమ్మాలపాటి.సుధాకర రావు గారు అధ్యక్షత వహించి జిల్లాలో నిర్వహించే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల గురించి వివరించారు.తదుపరి ఎయిడ్స్ బాధితులకు అమృత కలశములు కార్యక్రమము నకు విచ్చేసిన అతిదులచే పంపిణీ చేయుట జరిగినది. తదుపరి విశిష్ఠ అతిథి శ్రీ ఏలూరి.శ్రీనివాసరావు గారు సంస్థలో నిర్వహించే సేవా కార్యక్రమములు గురించి తెలుసుకుని,సంస్థ వారు చేస్తున్న సేవలను కొనియాడి, మున్ముందు సంస్థకు అందుబాటులో ఉంటూ,సంస్థకు ఏ అవసరము వచ్చిన తమ వంతు సేవలు తాము అందించుటకు సిద్ధముగా ఉన్నామని తెలియచేసారు. అనంతరం మన ఆహ్వానాన్ని మన్నించి కార్యక్రమములో పాల్గొన్న అతిథులను చిరు సత్కారముతో సత్కరించుకొనుట జరిగినది. ఈకార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు,ఖమ్మం సమితి కన్వీనర్ గారు,జాతీయ నిత్య నారాయణ సేవా ఇన్చార్జిగారు, సమితి కార్యవర్గ సభ్యులు,బాధ్యులు,ఆక్టివ్ మెంబెర్స్ ,యూత్ సభ్యులు,మహిళలు ,భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొంది తరించారు.ఈ బృహత్తర కార్యక్రమమునకు తెర వెనుక ఉండి,ఆదినుండి తమ వంతు సేవలందిస్తున్న మన సాయి కుటుంబ సభ్యురాలు శ్రీమతి సరస్వతి గారిని చిరు సత్కారముతో సత్కరించుకొనుట జరిగినది. తదుపరి మహా మంగళ హారతి నిర్వహించి కార్యక్రమములో పాల్గొన్న వారి అందరికీ స్వామి వారి ప్రసాదం సమర్పణ చేయుట జరిగినది. ఈకార్యక్రమము ను ఆది నుండి అంతము వరకు దగ్గర ఉండి ఘనముగా పూర్తిచేయించిన భగవాన్ బాబా వారికి ముందుగా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, ఈకార్యక్రమంలో భాగస్వామ్యులు అయిన ప్రతి ఒక్కరికి స్వామి వారి ఆశీస్సులు కోరుకుంటూ సాయిరాం