Special Programs
ఓం శ్రీ సాయిరాం భగవాన్ బాబా వారి శత జయంతి కార్యక్రమాలలో భాగంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షుల వారి ఆదేశానుసారం ఈరోజు సాయంత్రం 4 గంటలకు మందిరంలో World Heart Day సందర్భంగా గుండె వైద్య నిపుణులచే అవగాహన సదస్సు ఏర్పాటు చేయడమైనది. ఈ సదస్సుకు ప్రముఖ గుండె వైద్య నిపుణులు శ్రీ A. Praveen MD.DM గారు హాజరు అయి గుండె జబ్బులకు కారణాలు, తగు జాగ్రత్తల గురించి. అవగాహన కల్పిస్తూ వివరించారు. ఈ సందర్భంగా ఒక అవగాహన ర్యాలీ సాయంత్రం 4 గంటలకు మందిరం నుండి మొదలు అయి ఆ పరిసర ప్రాంతాలలో నిర్వహించి మందిరం లోని వైద్య సేవా ప్రాంగణంలో ఈ సదస్సు నిర్వహించబడింది.. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు , జిల్లా కార్యవర్గ సభ్యులు , ఖమ్మం సమితి కన్వీనర్ , సమితి కార్యవర్గ సభ్యులు, వైద్య విభాగ ఇంచార్జి, డాక్టర్స్, పురుషులు, మహిళలు మరియు యూత్ సభ్యులు హాజరైనారు.. World heart day సందర్భంగా డాక్టర్స్ ఇచ్చిన విలువైన సూచనలు శ్రద్ధగా విన్నారు సాయిరాం