Bhajans
🕉️శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో నిర్వహించబడుతున్న వంద రోజులు దీక్షా కార్యక్రమంలో భాగంగా 59వ, రోజు శనివారం సాయంత్రం 27-09-2025 తేదీన ఖమ్మం సమితి అమ్మపేట గ్రామంలో 7 గృహ భజనలు జరిగినవి. అమ్మపేట గ్రామంలో జరిగిన వివిద గృహభజనలలో ఖమ్మం జిల్లా కార్యవర్గ సభ్యులు, ఖమ్మం సమితి కార్యవర్గ సభ్యులు, భక్తులు ముఖ్యంగా గ్రామస్తులు ఉత్సాహంతో పాల్గొని స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సులు పొందినారు. ఇంటింటా సాయి ప్రతి ఇంటా సాయి కార్యక్రమంలో భాగంగా కొత్తవారికి స్వామి చిత్రపటాలు కూడా ఇవ్వటం జరిగింది. జై సాయిరాం 🙏