Special Programs
ఓం శ్రీ సాయిరాం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా **** భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో... స్వామి వారి శత జయంతి ఉత్సవాలు పురస్కరించుకుని మరియు జనవరి 2026 లో ఖమ్మం జిల్లా కళా బృందాల తో పర్తి యాత్ర సంకల్పించుకున్న నేపథ్యం లో 23/9/2025 మంగళవారం భక్త రామదాసు కళాక్షేత్రం లో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు మరియు తెలంగాణ మొగిలి కళా సేవా సమితి ఖమ్మం వారి సంయుక్త ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించబడింది.. ఈ సందర్భంగా 23/9/2025 మంగళవారం ఉదయం 9-00AM లకు శ్రీ సత్యసాయి ప్రేమ రథ యాత్ర - కళాబృందాలతో ర్యాలీ ఖమ్మం ZP సెంటర్ నుండి భక్త రామదాసు కళాక్షేత్రం వరకు నిర్వహించబడింది. బతుకమ్మ , కళాబృందాల ప్రదర్శనలు భక్త రామదాసు కళా క్షేత్రం గ్రౌండ్ లో ప్రదర్శించబడ్డాయి.. ఆత్మీయ అతిథులచే సందేశాలు మరియు కళాకారులకు సన్మానాలు చేయడం జరిగింది.. జిల్లా అద్యక్షులు జనవరి 2026 లో కళా బృందాల తో చేపట్టనున్న పర్తి యాత్ర గురించి వివరించారు.. ఖమ్మం సమితి కన్వీనర్ , సాయి కుటుంబ సభ్యులు, కళాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.. సాయంత్రం భజన కూడా రామదాసు కళాక్షేత్రం లో జరిగింది. ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా