Pujas & Vrathams
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామి వారి శత జయంతి ఉత్సవములలో భాగముగా జిల్లా వ్యాప్తంగా నిర్వహించబడుతున్న మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం కార్యక్రమములలో భాగముగా , ఖమ్మం సమితి పరిధిలోని రఘునాథపాలెం మండలము కోటపాడు భజన మండలి గ్రామమైన శివాలయ ప్రాంగణములో ఈరోజు శనివారం ఉదయంమహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం అంగ రంగ వైభవముగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమములో జిల్లా అధ్యక్షులు,సమితి కన్వీనర్ ,కోటపాడు భజన మండలి కన్వీనర్,సమితి బాధ్యులు ,జిల్లా బాధ్యులు,భక్తులు ,గ్రామస్తులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమము అనంతరం కార్యక్రమము లో పాల్గొన్న నూతన భక్తులకు ఇంటింటా సాయి ప్రతి ఇంటా సాయి కార్యక్రమములో భాగముగా స్వామి వారి చిత్ర పటములు బహుకరించుట జరిగినది