Special Programs
🙏🏻ఓం శ్రీ సాయిరాం 🙏🏻 శ్రీ సత్యసాయి సేవా సమితి ఖమ్మం ఖమ్మం జిల్లా .................. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో ఖమ్మం జిల్లా ,ఖమ్మం సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న నేషనల్ నారాయణ సేవలలో భాగంగా ఈనెల 12/09/25 వ తేదీన శ్రీమతి ఈశ్వరాంబా మహిళా వృద్ధాశ్రమం ఖమ్మం వేదికగా 31 మంది ఎయిడ్స్ పేషంట్స్ కు అమృత కలశం లు ప్రేమతో అంద చేయుట జరిగినది. ఈ సేవా కార్యక్రమము లో జిల్లా సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులు. శ్రీ D సుధాకర రావు గారు, ముఖ్య అతిథులు శ్రీ గుత్తా వెంకటేశ్వరరావు గారు మరియు శ్రీ లక్ష్మారెడ్డి గారు, శ్రీ సత్యసాయి సమాజ సేవా ట్రస్టు చైర్మన్ శ్రీ మాదిరాజు రామచంద్రరావు గారు, సమితి కన్వీనర్ గారు,సమితి కార్యవర్గ సభ్యులు, సమితి యాక్టివ్ మెంబెర్స్ ,భక్తులు పాల్గొని సేవలందించి స్వామి వారి ఆశీస్సులు పొంది తరించారు.🔸 🙏🏻జై సాయిరాం🙏🏻 కన్వీనర్, శ్రీ సత్యసాయి సేవా సమితి , ఖమ్మం.