Special Programs
శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, తెలంగాణ రాష్ట్రం వారు 10/9/2025 ఉదయం 11- 00 లకు రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్న వ్యాసరచన పోటీలలో భాగంగా ఖమ్మం జిల్లా ఖమ్మం సమితి వి వెంకటాయపాలెం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో వ్యాసరచన పోటీలు జిల్లా అధ్యక్షులు శ్రీ D సుధాకర రావు గారు మరియు ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ Y హనుమంత రావు గారు ప్రారంభించారు. మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు..ఈ రోజు జిల్లా వ్యాప్తంగా అనేక పాఠశాలలు మరియు కాలేజీలలో రాష్ట్ర స్థాయి వ్యాస రచన పోటీలు నిర్వహించబడినవి.. జిల్లా కార్యవర్గ సభ్యులు సమితి కన్వీనర్లు, సమితిసభ్యులు, బాలవికాస్ గురువులు, మహిళా సభ్యులు, యూత్ సభ్యులు, యాక్టివ్ సభ్యులు జిల్లా వ్యాప్త వ్యాసరచన పోటీలు నిర్వహించడము లో ప్రత్యేక కృషి చేశారు. ఆయా పాఠశాలల మరియు కాలేజీల /ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్ , సిబ్బంది తమ సహకారం అందించారు.. సాయిరాం జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా