Special Programs





🌻ఓం శ్రీ సాయిరాం🌻 శ్రీ సత్య సాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో.... ఇటీవల వైరా లోని శ్రీ సత్య సాయి గోశాల లోని "నారాయణ" పేరుతో వ్యవహరించే ఆవు దూడకు ప్రమాద వశాత్తూ కాలుకు ఫ్రాక్చర్ ( Transverse fracture of hind right leg) అయిన విషయం దృష్టికి వచ్చి, సర్జరీ సదుపాయం అక్కడ లేనందున జిల్లా అధ్యక్షులు మరియు జిల్లా సర్వీసు కోఆర్డినేటర్ పశువైద్యాధికారి అయిన డా N ఉమా కుమారి గారు అట్టి ఆవు దూడను ఖమ్మం జిల్లా వెటర్నరీ ఆసుపత్రికి రప్పించి నిపుణులచే 30/8/2025 తేదీన విలువైన సంబంధిత సర్జరీ చేపించి తిరిగి గోశాలకు సురక్షితంగా పంపుట జరిగినది..తిరిగి బాగోగులు గమనిస్తూ, 7/9/2025 తేదీన గోశాల సందర్శించి దూడ ఆరోగ్యం పై, జిల్లా అధ్యక్షులు శ్రీ డి సుధాకర రావు గారు మరియు పశు వైద్యాధికారిణి శ్రీమతి ఉమాకుమారి గారు సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. ఇతర జిల్లా కార్యవర్గ సభ్యులు, పెద్దలు కూడా సందర్శించి సంతోషం వెలిబుచ్చారు. మూగ జీవులపై స్వామి వారికి ఉన్న ప్రేమకు, జీవ కారుణ్యానికి ఈ సంఘటన ఒక నిదర్శనం. సాయిరాం🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్య సాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా