Special Programs





శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా *** భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామి వారి శత జయంతి వేడుకలు పురస్కరించుకొని వైరా సమితి పెద్ద మునగాల గ్రామంలో గ్రామోత్సవ వేడుకలు 24/8/2025 తేదీన వైభవంగా జరిగాయి.. నగర సంకీర్తన, మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, విద్యార్థులకు ఆటలపోటీలు బహుమతుల ప్రధానం, ప్రేమతరు కార్యక్రమం, భీమరథశాంతి కార్యక్రమాలు జరిగాయి.. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, సమితి కన్వీనర్, కార్యవర్గ సభ్యులు, మహిళా సభ్యులు, యూత్ సభ్యులు, యాక్టివ్ సభ్యులు, సీనియర్ డివోటీస్, గ్రామస్థులు పాల్గొన్నారు.. సాయిరాం🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా