Special Programs
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామి వారి శత జయంతి ఉత్సవముల్లో భాగముగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబడుతున్న గ్రామోత్సవ కార్యక్రమములలో భాగముగా ఖమ్మం సమితికి కేటాయించిన గ్రామము యల్లన్న నగర్ లో 23-08-25 వ తేదీ శనివారం ఉదయం నగర సంకీర్తన తో ప్రారంభమై ఈ రోజు సాయంత్రం వరకు వివిధ ఆధ్యాత్మిక,సాంస్కృతిక ,బాలవికాస్ కార్యక్రమములు కొనసాగించబడినవి. ఈ వేడుకలో భాగంగా మాతృపూజలు, అమృత కలశాలు పంపిణీ, ఉపాధ్యాయులకు సన్మానాలు, విద్యార్థులకు ఆటలపోటీలు, బహుమతుల ప్రధానం, పెద్దల ప్రసంగాలు జరిగాయి. ఈ కార్యక్రమములో జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులు,జిల్లా కార్యవర్గ సభ్యులు,ఖమ్మం సమితి కన్వీనర్,సమితి కార్యవర్గ సభ్యులు,గ్రామస్థులు పాల్గొన్నారు.. జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, ఖమ్మం జిల్లా