Special Programs
ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామి వారి శత జయంతి ఉత్సవాలలో భాగంగా స్వామి కృపా కటాక్షములతో ఖమ్మం సమితి బొప్పారం గ్రామంలో గ్రామోత్సవం కార్యక్రమం అత్యద్భుతంగా నిర్వహించటం జరిగినది. కార్యక్రమం ఉదయం నగర సంకీర్తన, హనుమాన్ చాలీసా, బాలవికాస్ చిన్నారులకు క్విజ్, గేమ్స్, బహుమతి ప్రదానం మరియు గ్రామ సేవకులకు మరియు గ్రామ పెద్దలకు సత్కారం, స్వామి చిత్రపటముల బహుకరణ, మహా మంగళ హారతి వరకు అన్ని కార్యక్రమాలు నిర్విఘ్నంగా. వైభవంగా జరిగాయి.. ఈ కార్యక్రమంలో ఖమ్మం సమితి కన్వీనర్ గారు, సమితి కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు మహిళా విభాగం సభ్యులు, యూత్ విభాగం సభ్యులు, బాల వికాస్ గురువులు , గ్రామంలోని చిన్నారులు, గ్రామ పెద్దలు మరియు గ్రామ సేవకులు అందరూ ప్రేమతో పాల్గొన్నారు. సాయిరాం.