Special Programs






ఓం శ్రీ సాయిరామ్ భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామి వారి శత జయంతి వేడుకలు పురస్కరించుకొని గ్రామోత్సవాలలో భాగంగా మధిర సమితి తొర్లపాడు గ్రామంలో ఉదయం నుండి సాయంత్రం వరకు అనేక ఆధ్యాత్మిక మరియు సేవా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. సేవా కార్యక్రమాలు లో భాగంగా పశు వైద్య సిబ్బందిచే మేకలకు నట్టల నివారణ మందు త్రాగించుట జరిగింది. విద్యార్థిని విద్యార్థులకు ఆటలపోటీలు, మాతృపూజలు, మహిళలకు ఆటలు మరియు పాటల పోటీలు, ముగ్గుల పోటీలు, బతుకమ్మ తయారీ పోటీలు, స్కూల్ పిల్లలకు డ్రెస్సెస్ పంపిణీ, నారాయణ సేవ, వివిధ శాఖల ఉద్యోగులకు సన్మానాలు , పోటీలలో గెలుపొందినవారికి బహుమతి ప్రధానం స్వామి కృపతో ఘనంగా జరిగాయి..స్వామి వారికి మంగళ హారతి సమర్పణతో కార్యక్రమం ముగిసింది. ఈ గ్రామోత్సవ కార్యక్రమంలో ఖమ్మం సెక్టోరల్ అధికారి శ్రీ రామకృష్ణ గారు , మధిర MEO శ్రీ ప్రభాకర్ గారు, దెందుకూరు PHC Dr పృధ్వీ గారు, మధిర మండల పశు వైద్య సిబ్బంది, ఇంకనూ శ్రీ సత్య సాయి సేవా సంస్థల జిల్లా కార్యవర్గ సభ్యులు, జిల్లా మహిళా సేవా కోఆర్డినేటర్, మధిర సమితి కన్వీనర్, సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.. సాయిరాం జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా