Pujas & Vrathams
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామివారి శత జయంతి ఉత్సవాల్లో భాగముగా,మరియు శ్రావణమాసమును పురస్కరించుకుని ఖమ్మం సమితి పరిధిలోని పండితాపురం గ్రామములోని రామాలయ ప్రాంగణములో ఖమ్మం సమితి లోని మహిళా విభాగం వారి ఆధ్వర్యములో 22/8/2025 తేదీన శ్రావణ మాస ఆఖరి శుక్రవారం సాయంత్రం సామూహిక వరలక్ష్మీ కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించబడినవి....ఈ కార్యక్రమములో ఆ గ్రామములోని మహిళలు అంతంత భక్తి శ్రద్ధలతో పాల్గొని స్వామి వారి అమ్మ వారి ఆశీస్సులు పొంది తరించారు. అలాగే ఇంటింటా సాయి ప్రతి ఇంటా సాయి కార్యక్రమములో భాగముగా ఈరోజు పూజా కార్యక్రమములో పాల్గొన్న గ్రామస్థులకు స్వామి వారి చిత్ర పటములు బహుకరించుట జరిగినది. జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, ఖమ్మం జిల్లా