Bhajans
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామి వారీ శత జయంతి ఉత్సవాలు పురస్కరించుకుని నిర్వహించబడుతున్న100 రోజుల దీక్షా కార్యక్రమాలలో భాగముగా 19/8/2025 తేదీన ఇరువదవరోజు మంగళవారం సాయంత్రం మహిళా దినోత్సవమును పురస్కరించుకుని. ఖమం నేతాజీనగర్ లో వుంటున్న శ్రీ కిలారు.శ్రీనివాసరావు గారు,శ్రీమతి అన్నపూర్ణ గారి ఇంటివద్ద మహిళలచేత నామ సంకీర్తనా కార్యక్రమము ఘనముగా నిర్వహించబడింది.ఈకార్యక్రమంలో 70 మంది మహిళలు,30 మంది పురుషులు పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందినారు. ఈ కార్యక్రమమునకు ఆ ఏరియా వార్డు మహిళా కార్పొరేటర్ శ్రీమతి Ch.లక్ష్మీ నాగేశ్వర రావు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి స్వామి వారి ఆశీస్సులు పొంది తరించారు. ఈ కార్యక్రమములో శ్రీ సత్యసాయి ధ్యాన మండలి లోని మహిళలు,మరియు ఆ వార్డులో ఉన్న ఇంటి చుట్టుపక్కల ఉన్న మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనుట జరిగింది. మరియు ఈ కార్యక్రమములో ఇంటింటా సాయి ప్రతి ఇంటా సాయి కార్యక్రమములో భాగముగా, కార్యక్రమములో పాల్గొన్న నూతన భక్తులకు స్వామి వారి చిత్రపటములు బహుకరించుట జరిగినది.ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంగా ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగిన అన్ని కార్యక్రమాలను దగ్గర ఉండి ఘనముగా పూర్తిచేయించిన స్వామి వారికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, సాయిరాం