Pujas & Vrathams
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామి వారి శత జయంతి ఉత్సవముల్లో భాగముగా మరియు శ్రావణమాసమును పురస్కరించుకుని ఈరోజు శుక్రవారం సాయంత్రం ఖమ్మం సమితి పరిధిలోని భజనమండలి గ్రామం అయిన తిమ్మినేని పాలెం గ్రామములో వున్న రామాలయ ప్రాంగణములో ఖమ్మం సమితిలోని మహిళా విభాగం వారి ఆధ్వర్యములో సామూహిక వరలక్ష్మీ కుంకుమ పూజలు ఘనముగా నిర్వహించబడినవి. ఈ కార్యక్రమంలో గ్రామములోని 65 మంది మహిళలు భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమములో పాల్గొని స్వామి వారి అమ్మ వారి ఆశీస్సులు పొంది తరించారు .