Pujas & Vrathams
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఖమ్మం సమితిలోని మహిళా విభాగం వారి ఆధ్వర్యములో 1/8/2025 శుక్రవారం సాయంత్రం ఆరెంపల శ్రీసిటీ కాలనీ లో సామూహిక వరలక్ష్మీ వ్రతములు ఘనముగా నిర్వహించబడినవి.ఈ పూజ కార్యక్రమములో కాలనీలోని 60 మంది మహిళలు భక్తి,శ్రద్ధలతో కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి మరియు స్వామి వారి ఆశీస్సులు పొంది తరించారు.ఈ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమములో జిల్లా బాధ్యులు,సమితి బాధ్యులు ,భక్తులు పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొంది తరించారు.