Pujas & Vrathams






ఓం శ్రీ సాయిరాం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో వైరా సమితి శ్రీ సత్యసాయి వేద పాఠశాల ప్రాంగణంలో స్వామి వారి శత జయంతి వేడుకలు మరియు జనవరి 2026 పర్తి యాత్ర పురస్కరించుకుని శ్రావణ శుక్రవారం 1/8/2025 తేదీన ఉదయం వరలక్ష్మీ వ్రతాలు ఘనంగా జరిగాయి..40 మంది మహిళలు భక్తితో వ్రతములో పాల్గొన్నారు. మరియు గోపూజ నిర్వహించారు.. జిల్లా అధ్యక్షుల వారు వైరా సమితి కార్యక్రమాలు సమీక్షిస్తూ స్వామి వారి శత జయంతి ఉత్సవాలు సందర్భంగా పలు అంశములు సూచించారు. పర్తి యాత్ర సందర్భంగా చెక్కభజన కోలాటం బృందాలను సగౌరవంగా భాగస్వాములను చేయవలసిన ఆవశ్యకత తెలిపారు. అన్నవరం గ్రామంలో ప్రేమతరు కార్యక్రమం లో భాగంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమం లో జిల్లా కార్యవర్గ సభ్యులు, వైరా సమితి కన్వీనర్ కార్యవర్గసభ్యులు, ట్రస్ట్ సభ్యులు,,భజన మండలి కన్వీనర్లు, మహిళా సభ్యులు, యూత్ సభ్యులు, యాక్టివ్ సభ్యులు పాల్గొన్నారు. సాయిరాం జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా