Service
🙏🏻ఓం శ్రీ సాయిరాం 🙏🏻 శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ప్రతి సంవత్సరం ఖమ్మం TGRTC పాత బస్టాండ్ ఆవరణలో వేసవి లో ఖమ్మం సమితి లోని మహిళా సేవాదళ్ సభ్యులచే జల ప్రసాద సేవ ( చలివేంద్రం) నిర్వహించటం జరుగుతున్నది.ఈ సంవత్సరం కూడా అదే విధంగా , వేసవి కారణముగా తీవ్ర ఉష్ణోగ్రతలు కారణంగా ప్రయాణికుల అవసరము గుర్తించి గురువారం 10-04-25 వ తేదీన ఉదయం 10-00 గంటలకు స్వామి వారి కృపతో, ఆశీస్సులతో చలివేంద్రము ప్రారంభించుట జరిగినది. ఈ కార్యక్రమంలో TGRTC స్టేషన్ మేనేజర్ శ్రీ దినేష్ కుమార్ గారు మరియు శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా అద్యక్షులు, ఖమ్మం సమితి కన్వీనర్ గారు, జిల్లా మరియు ఖమ్మం సమితి కార్యవర్గ సభ్యులు, మహిళా సభ్యులు ,యూత్ సభ్యులు, భక్తులు, యాక్టివ్ సభ్యులు పాలోన్నారు. ఇట్టి సేవలు ప్రతిరోజూ ఉదయం 9-00 గంటలనుండి సాయంత్రం 5-00 గంటల వరకు ,వేసవి తీవ్రత తగ్గే వరకు కొనసాగించబడతాయి. సాయిరాం. జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా