స్వామి వారి అవ్యాజ ప్రేమతో సాయి కుటుంబ సభ్యుల ప్రేమ పూర్వక స్పందనతో " విద్య జ్యోతి పాఠశాల" అయిన "ప్రాథమిక పాఠశాల సిరిసిల్ల" లో విద్యార్థినీ విద్యార్థులకు ఈ రోజు రిపబ్లిక్ డే ని పురస్కరించుకొని సుమారు రూ.19000 విలువైన " బ్లాక్ అండ్ వైట్ షూ " లను ప్రేమతో అందించడమైనది. ఇట్టి కార్యక్రమం పరిపూర్ణమవడానికి, మనకి ఒక చక్కని సేవ భాగ్యాన్ని కలిగించిన మన స్వామి వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.