Special Programs






భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామి వారి శత జయంతి ఉత్సవముల లో భాగముగా, ఖమ్మం శ్రీ సత్యసాయి సేవా సమితి యువజన విభాగం వారిచే స్వామి అనుగ్రహముతో సంకల్పించుకున్న 100 గ్రామములలో 100 పల్లకీ సేవలు చేసే క్రమములో ఖమ్మం సమితిలో 99 పూర్తిచేసుకుని 100 వ పల్లకీ సేవను పుట్టపర్తిలో ఘనముగా పూర్తి చేసుకోవటం జరిగినది.ఈ సందర్భమును పురస్కరించుకుని పుట్టపర్తిలో 100 పల్లకీ సేవల ముగింపు సమావేశములో తెలంగాణ రాష్ట్ర సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులు,రాష్ట్ర సేవాదళ్ సమన్వయకర్తలు,వివిధ విభాగముల రాష్ట్ర సమన్వయకర్తలు,ఖమ్మం జిల్లా సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులు,కార్యవర్గ సభ్యులు,ఖమ్మం సమితి కన్వీనర్,మరియు సమితి బాధ్యులు,భక్తులు పాల్గొన్నారు.రాష్ట్ర అధ్యక్షులవారు ఈసేవా కార్యక్రమములో వివిధ గ్రామములనుండి విచ్చేసిన భక్తులను ప్రశంసించి తగు సందేశమును అందించారు.అలాగే 100 పల్లకీ సేవలను ,అకుంఠిత దీక్షతో,భక్తి శ్రద్ధలతో స్వామి అనుగ్రహంతో పూర్తి చేసిన ఖమ్మం సమితిలోని యువజన విభాగ సభ్యులను కొనియాడి,ఇటువంటి బృహత్తర కార్యక్రమమును నిర్వహించినందుకు అభినందించారు.ఈ కార్యక్రమములో వివిధ పెద్దలు పాల్గొని యువత ను ప్రోత్సహిస్తూ ప్రశంసలు అందించారు.100 పల్లకీ సేవలను దగ్గర ఉండి ఘనముగా పూర్తి చేయించిన స్వామి వారికి ముందుగా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ,చివరిగా ఖమ్మం సమితి కన్వీనర్ గారు యువతను అభినందిస్తూ,ముందు ముందు ఇంకా రెట్టించిన ఉత్సాహముతో స్వామి వారి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనే అవకాశము వారికి కల్పించాలని సాయి వారిని ప్రార్థిస్తూ ,ఈ ముగింపు వేడుకలలో తమ అమూల్య సమయమును వెచ్చించి కార్యక్రమములో పాల్గొన్న తెలంగాణ సత్య సేవా సంస్థ పెద్దలందరికీ,ఈ సమావేశములో పాల్గొన్న ఖమ్మం జిల్లా సత్యసాయి సేవా సంస్థల బాధ్యులకు, భక్తులకు అందరికీ ఖమ్మం సత్యసాయి సేవా సమితి తరపున ధన్యవాదములు తెలియచేయుటతో కార్యక్రమము ముగిసినది.జై సాయిరాం. కన్వీనర్,శ్రీ సత్యసాయి సేవా సమితి,ఖమ్మం