Service






భగవాన్ బాబా వారి ఆరాధన మహోత్సవమును పురస్కరించుకుని ఖమ్మం పాత బస్ స్టాండ్ ఆవరణలో ఖమ్మం సమితిలోని మహిళా విభాగం వారి పర్యవేక్షణలో కొనసాగుతున్న చలివేంద్ర సేవా కేంద్రము వద్ద ఈరోజు ఉదయం వేసవి దాహార్తి తీర్చుటకు మజ్జిగ వితరణ మరియు పులిహోర ప్రసాద వితరణ సేవ నిర్వహించబడింది. మరియు వేసవి కాలము దృష్ట్యా అవసర మైనబాట సారులకు పాదరక్షలు పంపిణీ చేసే సేవా కార్యక్రమము కూడా కొనసాగింది. ఇంత చక్కటి సేవా కార్యక్రమము ను నిర్వహించుకునే అవకాశము కలిగించిన స్వామి వారికి ముందుగా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ,ఈ సేవా కార్యక్రమములో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మహిళా సాయి సేవకులందరికీ ఖమ్మం సత్యసాయి సేవా సమితి తరపున ధన్యవాదములు తెలియచేసుకుంటున్నాము. కన్వీనర్,శ్రీ సత్యసాయి సేవా సమితి,ఖమ్మం.