Special Programs






భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామి వారి శత జయంతి ఉత్సవముల్లో భాగముగా నిర్వహించుకునే కార్యక్రమాలలో భాగముగా ఖమ్మం సమితి లోని యువజన విభాగం వారు సంకల్పించుకున్న 100 గ్రామములలో 100 పల్లకీ సేవలలో ఖమ్మం సమితిలో 99 పల్లకీ సేవలు పూర్తిచేసుకుని 100 వ పల్లకీ సేవను పుట్టపర్తిలో 25-04-25 వ తేదీ సాయంత్రం ఘనముగా నిర్వహించుకొని స్వామి వారి పాదపద్మములకు సమర్పించుట జరిగినది.ఈ 100 వ పల్లకీ సేవలో వివిధ గ్రామములలో పల్లకీ సేవ నిర్వహించుకున్న రిసోర్స్ పర్సన్స్ ఖమ్మం సమితి బాధ్యులు,జిల్లా బాధ్యులు,భక్తులు పాల్గొని స్వామి వారి అనుగ్రహ ఆశీస్సులు పొంది తరించారు.ఖమ్మం సమితి యువత సంకల్పించుకున్న 100 పల్లకీ సేవలను దగ్గర ఉండి ఘనముగా పూర్తిచేయించిన స్వామి వారికి ముందుగా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, ఈ100 పల్లకీ సేవల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ఖమ్మం సమితిలోని యువజన విభాగ సభ్యులందరికీ సంస్థ తరపున ధన్యవాదములు తెలియచేసుకుంటున్నాము. కన్వీనర్,శ్రీ సత్యసాయి సేవా సమితి,ఖమ్మం