Special Programs
🙏🏾ఓం శ్రీ సాయిరాం🙏🏾 🔹భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామి వారి శత జయంతి ఉత్సవాలలో భాగంగా నిర్వహించుకునే"100 గ్రామాలలో100 పల్లకీ సేవల "మహాయజ్ఞంలో భాగంగ "ఖమ్మం సమితిలోని యువజన విభాగం "వారి ఆధ్వర్యంలో నిర్వహించబడే 99 వ పల్లకీ సేవ ల మహాయజ్ఞం ఈ నెల (13-04-2025)వ తేది ఆదివారం సాయంత్రం 6:00 లకు ఖమ్మం జిల్లా, వైరా మండలం గొల్లెనపాడు గ్రామములో అంగ రంగ వైభవంగా నిర్వహించబడింది.స్వామి వారు తమ ఇంటిముందుకు వచ్చినప్పుడు ఇంటివారందరు నీరు వారగా పోసి స్వామి వారికి మంగళ నీరాంజనములు సమర్పించి స్వామి వారి ఆశీస్సులు పొందినారు.ఈ సేవా కార్యక్రమములో జిల్లా సత్యసాయి సేవాసంస్థల బాధ్యులు,సమితి బాధ్యులు, యూత్ సభ్యులు,భక్తులు, గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందినారు. ఈకార్యక్రమములో ఆ గ్రామములోని భక్తులు స్వామి వారి ఊరేగింపులో కోలాటములు చేస్తూ స్వామి వారిని స్తుతిస్తూ అందరిని అలరింప చేసి, స్వామి వారి ఆశీస్సులు అందుకుని తరించారు. ఈకార్యక్రమంలో ఆది నుండి అంతము వరకు దగ్గర వుండి ఘనముగా పూ ర్తిచేయించిన స్వామి వారికి ముందుగా కృతజ్ఞతలు ...