Service
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు ఉదయం రంజాన్ పర్వదినమును పురస్కరించుకుని గాంధీచౌక్ లోని పాత టెలిఫోన్ ఎక్చేంజ్ పక్కనే వున్న ఈద్గా దగ్గర నమాజ్ చేయుటకు వచ్చిన ముస్లిం సోదరుల పాదరక్షలు భద్రపరిచే సేవలో పాల్గొన్న ఖమ్మం సమితిలోని సాయి సేవక బృంద సభ్యులు.ఈ సేవా కార్యక్రమము లో జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులు,జిల్లా బాధ్యులు,ఖమ్మం సమితి కన్వీనర్ గారు,సమితి బాధ్యులు ,యూత్ సభ్యులు ,భక్తులు అందరూ పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందినారు.ఈ సేవా కార్యక్రమ కేంద్రమును త్రీ టౌన్ సి.ఐ గారు సందర్శించి సత్యసాయి సేవా సంస్థల సేవలను కొనియాడి సంతృప్తి వ్యక్తము చేసినారు.ఈ సేవా కార్యక్రమంలో ఆది నుండి అంతము వరకు దగ్గర ఉండి పూర్తి చేయించిన స్వామి వారికి ముందుగా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, సేవలో పాల్గొన్న వారందరికీ సంస్థ తరపున ధన్యవాదములు తెలియచేసుకుంటున్నాము. కన్వీనర్,శ్రీ సత్యసాయి సేవా సమితి,ఖమ్మం.