Special Programs




ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో తేది. 17.12.2024 మంగళవారం శ్రీ సత్యసాయి భజన మండలి కొత్తపల్లి (గోరి) వద్ద ఉదయం 8.00 గంటల నుండి మధ్యాహ్నం 3.30 గంటల వరకు స్వామి వారి శత జయంతి వేడుకలలో భాగంగా విశేషమైన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. స్వామి వారి పతాక ఆవిష్కరణ తో మొదలుకొని, జ్యోతి ప్రజ్వలన, ప్రత్యేక భజన కార్యక్రమం, స్వామి వారి సందేశం, మహా పల్లకి సేవ అంగరంగ వైభవం గా గ్రామ పుర వీధులలో కోలాట భజనతో, స్వామి వారిని ఇంటింటికి ఆహ్వానిస్తు, హరతులతో, టెంకాయ ప్రసాదాలు సమర్పిస్తూ దాదాపు 150 మంది పాల్గొని విజయవంతం చేసారు. తదుపరి జిల్లా అధ్యక్షులు సంతోషం తో స్వామి వారి శత జయంతి వేడుకలు ఇలాగే ఘనంగా నిర్వహించాలని, నమ్మిన వారికి నమ్మినంత స్వామి వారు ఇంట జంట కంట ఉండి కాపాడుతారని స్వామి విషయాలు తెలియ జేశారు. అలాగే మహబూబాబాద్ జిల్లా వాస్తవ్యులు శ్రీ నాగేంద్ర గారు మాట్లాడుతూ రాబోయే ప్రశాంతి సేవలకు మన జిల్లాకు ఇచ్చిన విధంగా హాజరై స్వామి వారి కృపకు పాత్రులు కావాలని, తదుపరి స్వామి వారి అన్నప్రసాదం స్వీకరించి స్వామి దయతో కార్యక్రమం ముగింపు చేయడం జరిగింది. శ్రీ సత్యసాయి సేవ సంస్థలు, భూపాలపల్లి జయశంకర్ జిల్లా, తెలంగాణ