Special Programs






భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఖమ్మం జిల్లా వైరా సమితి పరిధిలో గల కొణిజర్ల మండలం పెదమునగాల గ్రామములో 1/12/2024 ఆదివారం శ్రీ సత్యసాయి ప్రేమరధ శోభాయాత్ర శోభాయమానంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమములో ఖమ్మం జిల్లా శ్రీ సత్యసాయిసేవా సంస్థల అధ్యక్షులు,జిల్లా కార్యవర్గ సభ్యులు,ఖమ్మం సమితి బాధ్యులు,భక్తులు ముఖ్యముగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందినారు.మహిళలు కోలాటం చేసుకుంటూ,స్వామి వారిని వీధుల వెంట విహరింపచేస్తు అందరినీ అలరించారు.ఈ కార్యక్రమమును దగ్గర వుండి నిర్వహింపచేసిన స్వామి వారికి ముందుగా కృతజ్ఞతలు తెలియచేస్కుంటూ,ఈకార్యక్రమంలో పాల్గొన్న సాయి కుటుంబ సభ్యులందరికీ సంస్థ తరఫున ధన్యవాదములు తెలియ చేసుకుంటున్నాము.జై సాయిరాం.