Special Programs






భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామి వారి 99 వ జన్మదిన వేడుకలు ఖమ్మం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి మందిరం లో 23/11/2024 సాయంత్రం 6 గంటలకు వేద పఠనం తో కార్యక్రమం ప్రారంభమై భజన తో కొనసాగి,స్వామి వారి దివ్య సందేశం,పుట్టిన రోజు కేక్ కట్ చేసి స్వామి వారికి సమర్పించి, బాణ సంచ కార్యక్రమము కొనసాగి మహా మంగళ హారతి తో ఈరోజు కార్యక్రమం ముగిసింది.ఈరోజు సుప్రభాత సేవ మొదలు సాయంత్రం వరకు జరిగిన అన్ని కార్యక్రమాలు దగ్గర వుండి ఘనముగా,నిర్విఘ్నముగా పూర్తి చేయించిన స్వామి వారికి ముందుగా కృతజ్ఞతలు తెలియ చేసుకుంటూ,ఈరోజు కార్యక్రమాల్లో భాగస్వామ్యులైన ప్రతి ఒక్కరికీ సంస్థ తరఫున ధన్యవాదములు తెలియ చేసుకుంటున్నాము. జై సాయిరాం. కన్వీనర్,శ్రీ సత్యసాయి సేవా సమితి, ఖమ్మం