Special Programs



ఓం శ్రీ సాయి రామ్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో .... ఖమ్మం జిల్లా లో అనేక ఆధ్యాత్మిక, సేవాకార్యక్రమాలు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న విషయం విదితమే.. ఇట్టి సేవా కార్యక్రమాలు సూచిస్తూ గత 15 సంవత్సరాలుగా ఖమ్మం జిల్లా క్యాలండర్ ముద్రించుట జరుగు చున్నది..స్వామి వారి 99 వ జయంతి వేడుకలు పురస్కరించుకుని 22/11/2024 శుక్రవారం నాడు 2025 సంవత్సర ఖమ్మం జిల్లా యాక్టివిటీస్ క్యాలండర్ ను జాతీయ సమావేశములో శ్రీ సత్య సాయి సేవా సంస్థల అఖిల భారత అద్యక్షులు, శ్రీ నిమీష్ పాండ్య గారు , శ్రీ సత్యసాయి మేనేజింగ్ ట్రస్టీ శ్రీ R J రత్నాకర్ గారు, తెలంగాణా రాష్ట్ర అద్యక్షులు శ్రీ P వెంకటరావు గార్లచే ఆవిష్కరణ జరిగింది.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు శ్రీ D సుధాకర రావు గారు ఇట్టి ఆవిష్కరణ విజయవంతం చేసిన స్వామి వారికి కృతజ్ఞతాపూర్వక ప్రణామములు సమర్పిస్తూ ఆవిష్కరణ చేసిన పెద్దలు అందరికి కృతజ్ఞతలు తెలియజేశారు.. ఈ సందర్భంగా స్వామి వారి 99 వ జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని జిల్లా ప్రజలందరికీ, సంస్థ సభ్యులందరికీ,సమితి,భజనమండలి కన్వీనర్లు, జిల్లా, సమితి కార్యవర్గ సభ్యులు , యూత్ సభ్యులు, మహిళా సభ్యులు, యాక్టివ్ సభ్యులు భక్తులు అందరికి జిల్లా అధ్యక్షులు ప్రేమ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సాయిరాం 🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా