Bhajans
ఓం శ్రీ సాయి రామ్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామి వారి 99 వ జయంతి మహోత్సవ కార్యక్రమాలలో భాగంగా 20-11-24 వ తేదీ బుధవారం సాయంత్రం 6-00 గంటలకు ఖమ్మం మామిళ్ళగూడెం లోని గాయత్రీ భవన్ వేదికగా వేద పఠనం తో కార్యక్రమము ప్రారంభమై భజన తో కొనసాగి ముఖ్య వక్త అయిన శ్రీ వి.స్.ఆర్ మూర్తి గారిచే శ్రీ సత్యసాయి వైభవము ఆధ్యాత్మిక ప్రసంగం కొనసాగింది. తదనంతరం జన్మదిన వేడుకగా కేక్ కట్ చేసి స్వామి వారికి సమర్పించి ,మంగళ హారతి సమర్పించుట తో నేటి సాయంకాల కార్యక్రమము ముగిసింది. సాయిరాం. జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, ఖమ్మం జిల్లా