Bhajans
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామి వారి 99 వ జయంతి మహోత్సవ కార్యక్రమాలలో నేడు అనగా 18-11-24 వ తేదీ సోమవారం సాయంత్రం వైరా రోడ్డు రోటరీ నగర్ లోని శ్రీనివాసకళ్యాణ మండపం లో సాయంత్రం 6 గంటలకు వేద పఠనంతో కార్యక్రమం ప్రారంభమై భజన తో కొనసాగి ముఖ్య వక్తగా విచ్చేసిన శ్రీ వడాలి.సాయి కృష్ణ గారి సమర్పణ ప్రోగ్రామ్ కొనసాగినది.ఈరోజు తిధుల ప్రకారం స్వామి వారి పుట్టిన రోజు కేక్ కట్ చేసి స్వామి వారికి సమర్పించి,స్వామి వారికి మహా మంగళ హారతి సమర్పించుటతో నేటి కార్యక్రమము ముగిసింది. ఈకార్యక్రమంలో ఆది నుండి అంతము వరకు దగ్గర వుండి నిర్విఘ్నముగా పూర్తి చేయించిన స్వామి వారికి ముందుగా కృతజ్ఞతలు తెలియ చేసుకుంటూ,ఈ రోజు కార్యక్రమములో భాగస్వామ్యులు అయిన ప్రతి ఒక్కరికీ సంస్థ తరపున ధన్యవాదములు తెలియ చేసుకుంటున్నాము.జై సాయిరాం. కన్వీనర్,శ్రీ సత్యసాయి సేవా సమితి, ఖమ్మం