Bhajans
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు సాయంత్రం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి మందిరములో సాయంత్రం 6 గంటలకు బాలవికాస్ చిన్నారులచే వేద పఠనము ,భజన దాని తదనంతరం ఖమ్మం సమితి పరిధిలోని వివిధ బాలవికాస్ సెంటర్లు లోని చిన్నారులచే వివిధ సాంస్కృతిక కార్యక్రమములు నిర్వహించబడినవి.ఈ కార్యక్రమం ఆది నుండి అంతం వరకు దగ్గర వుండి నిర్విఘ్నముగా పూర్తి చేయించిన స్వామి వారికి ముందుగా కృతజ్ఞతలు తెలియ చేసుకుంటూ,ఈకార్యక్రమంలో భా గస్వామ్యులైన వివిధ సెంటర్లు లోని చిన్నారులకు,చక్కటి ప్రోత్సాహము నిచ్చిన వారి తల్లితండ్రులకు మరియు ఈ కార్యక్రమం మొత్తం చక్కటి రూపకల్పన చేసి,ప్రదర్శింప చేసిన విద్యా విభాగ సమన్వయకర్తలకు,బాల వికాస్ గురువులకు ఖమ్మం సత్యసాయి సేవా సంస్థ తరపున ధన్యవాదములు తెలియ చేసుకుంటున్నాము.ఈకార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ సంస్థ తరపున ధన్యవాదములు తెలియ చేసుకుంటున్నాము.జై సాయిరాం.