Bhajans
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు అనగా 16-11-24 వ తేదీ శనివారంసాయంత్రం వి.డి. వోస్ కాలనీ లోని శ్రీమతి ఈశ్వరాంబ వృద్ధ మహిళా ఆశ్రమం లో సాయంత్రం 6 గంటలకు వేద పఠనంతో కార్యక్రమం ప్రారంభమై భజనతో కొనసాగి తదుపరి ముఖ్య వక్తగా విచ్చేసిన రామాయణ ప్రవచన సుధాకర బ్రహ్మశ్రీ డాక్టర్ మైలవరపు.శ్రీనివాసరావు గారిచే ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం కొనసాగిన తదుపరి స్వామి వారికి మంగళహారతి సమర్పణ తో నేటి కార్యక్రమములు ముగిసినవి. కార్యక్రమము ఆది నుండి అంతము వరకు దగ్గర వుండి నిర్విఘ్నముగా పూర్తి చేయించిన స్వామి వారికి ముందుగా కృతజ్ఞతలు తెలియ చేసుకుంటూ,ఈ కార్యక్రమములో భాగస్వామ్యులు అయిన ప్రతి ఒక్కరికీ సంస్థ తరపున ధన్యవాదములు తెలియ చేసుకుంటున్నాము.జై సాయిరాం. కన్వీనర్,శ్రీ సత్యసాయి సేవా సమితి, ఖమ్మం