Sri Sathya Sai Grama Seva MahaYagnam






సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య మంగళ ఆశీస్సులతో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు తెలంగాణ యువజన విభాగం పిలుపుమేరకు గ్రామ సేవ కార్యక్రమాన్ని వికారాబాద్ జిల్లాలోని మున్నూరు సోమారం గ్రామంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉదయం ఏడున్నర గంటలకు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అనంతరం గ్రామంలో పురవీధుల గుండా పల్లకి సేవ నిర్వహించడం జరిగింది. పల్లకి సేవ అనంతరం 122 గృహాలకు పైగా ఏకకాలంలో గృహ భజన నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మొక్కలు నాటడం, గ్రామం బాలబాలికలకు బాలవికాస్ నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా నారాయణ సేవ అనంతరం గ్రామస్తులకు మరియు సేవాదళ్ సభ్యులకు మియాపూర్ సేవాదళ్ సభ్యులు అయినటువంటి హేమంత్ కుమార్, గారిచే సత్సంగం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది, గ్రామంలో వృద్ధులకు దుప్పట్లు , వీల్ చైర్ పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, తెలంగాణ,యువజన విభాగం సమన్వయకర్త శ్రీ నాగరాజు గారు , శ్రీ సత్యసాయి సేవా సంస్థలు వికారాబాద్ జిల్లా అధ్యక్షులు శ్రీ జగదీశ్వర్ సింగ్ ఠాకూర్ గారు జిల్లా సేవాదళ్ కోఆర్డినేటర్ శ్రీ ప్రభాకర్ గారు, జిల్లా యువజన విభాగం సమన్వయకర్త శ్రీ బసవేశ్వర గారు, పెద్దలు గోపాల్ చారి గారు చేవెళ్ల సమితి,యువజన విభాగం జిల్లా సహా సమన్వయకర్త శ్రీ సునీల్ గారు,మాదారం సమితి కన్వీనర్ శ్రీ నాగరాజు గారు,వికారాబాద్ కన్వీనర్ శ్రీ సత్యనారాయణ గౌడ్ గారు, కేరెల్లి కన్వీనర్ శ్రీ K.రామకృష్ణారెడ్డి గారు, శ్రీ సత్య సాయి గ్రామీణ సార్వజనిక కేంద్రం కేరెల్లి అధ్యక్షులు శ్రీ బి రఘునందన్ గారు, ప్రధాన కార్యదర్శి శ్రీ ఎం ప్రేమ్ కుమార్ గారు కోశాధికారి శ్రీ కె వెంకటరామిరెడ్డి గారు, జిల్లాలోని వివిధ సమితుల పదాధికారులు అదేవిధంగా భజన మండలి పదాధికారులు, బాలవికాస్ విద్యార్థులు, సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు. ఉదయం 7.00 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా మున్నూరు సోమారం గ్రామస్తులు సుమారుగా 500 మంది పాల్గొని ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం అభినందనీయం. ఇంత పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను . శ్రీ కె రామకృష్ణారెడ్డి,కన్వీనర్, శ్రీ సత్య సాయి సేవా సమితి, కేరెల్లి వికారాబాద్ జిల్లా